
గుండెపోటుతో దామన్న వీరాభిమాని మృతి
అర్వపల్లి: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి వీరాభిమాని, జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన జానపాటి చంద్రయ్య(63) శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. దామోదర్‌రెడ్డి మరణించినప్పటి నుంచి చంద్రయ్య తీవ్రమైన బాధలో ఉన్నాడని, శనివారం తుంగతుర్తిలో దామోదర్‌రెడ్డి అంత్యక్రియలకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి నిద్రించిన చంద్రయ్య అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందిన ట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో దామోదర్‌రెడ్డి ఎక్కడికి వచ్చినా చంద్రయ్య ఆయన దగ్గరకు వెళ్లి వస్తాడని గ్రామస్తులు తెలి పారు. చంద్రయ్య భౌతికకాయానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఆదివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు చంద్రయ్యకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.