తెల్లబంగారం.. దళారులపరం! | - | Sakshi
Sakshi News home page

తెల్లబంగారం.. దళారులపరం!

Oct 5 2025 9:06 AM | Updated on Oct 5 2025 11:23 AM

తెల్ల

తెల్లబంగారం.. దళారులపరం!

న్యూస్‌రీల్‌

క్వింటాకు రూ.5వేలు చెల్లించారు

ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

సాక్షి, యాదాద్రి: ప్రకృతి వైపరీత్యాలు, కొనుగోళ్లలో ఒడిదుడుకులు పత్తి రైతును కుంగదీస్తున్నాయి. పంట చేతికొస్తున్నా సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కేంద్రాలను ప్రారంభించడం లేదు. పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు, ఇతర అవసరాలకు తక్కువ ధరకే పత్తిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు, ప్రైవేట్‌ వ్యాపారులు.. తేమ, నాణ్యత లేదని, రంగుమారిందని సాకులు చూపి ధర తగ్గిస్తున్నారు. జిల్లాలో 1,13,193 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 11,31,930 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 12 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

దక్కని మద్దతు ధర

కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.8110 నిర్ణయించింది. కానీ దళారులు, ప్రైవేట్‌ వ్యాపారులు రూ.6వేలకు మించి ధర చెల్లించడం లేదు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇళ్ల వద్దకు, పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు, దళారుల మోసాలను అరికట్టాల్సిన మార్కెటింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

తక్కువకు కొనుగోలు చేసి మద్దతు ధరకు..

మార్కెటింగ్‌ అధికారులు జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ప్రత్యేకంగా జిన్నింగ్‌ మిల్లులను ఎంపిక చేశారు. సీసీఐ ఆధ్వర్యంలో ఇక్కడ మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలి. ప్రస్తుతం సీసీఐ నుంచి సేకరణ ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్‌గా మిల్లుల్లోనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన పత్తిని తర్వాత రైతుల పేరున సీసీఐకి మద్దతు ధరకు విక్రయిస్తారు.

పత్తి చేతికొస్తున్నా తెరుచుకోని సీసీఐ కేంద్రాలు

ఫ అవసరాల నిమిత్తం ప్రైవేట్‌కు అమ్ముకుంటున్న రైతులు

ఫ ఇదే అదనుగా తీసుకుంటున్న దళారులు, వ్యాపారులు

ఫ తేమ, నాణ్యత పేరుతో కొర్రీలు.. క్వింటాకు రూ.4500 నుంచి రూ.5 వేలే చెల్లింపు

ఫ రూ.3 వేలకు పైగా నష్టపోతున్న కర్షకులు

ఈ చిత్రంలోని మహిళా రైతు పేరు బడికే లక్ష్మి. ఆత్మకూర్‌(ఎం) మండలం తుక్కాపూర్‌లో సొంత భూమికి తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పది ఎకరాల్లో పత్తి వేశారు. తొలుత చేతికొచ్చిన పత్తి ఏరగా 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఓ వ్యాపారికి విక్రయించగా క్వింటాకు రూ.4,500 చెల్లించాడు. పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు, ఇతర అవసరాల నిమిత్తం ఇప్పటికిప్పుడు పత్తి విక్రయించాల్సి వచ్చిందని, క్వింటాకు రూ.3600 నష్టపోయానని లక్ష్మి వాపోయింది. విపరీతమైన వర్షాలు, జాజురోగం వల్ల చేను దెబ్బతిన్నదని, పెట్టుబడి వెళ్లడం కూడా కష్టమేనని పేర్కొంది.

నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. తొలి దశ చేతికొచ్చి న పత్తిని వారం రోజుల క్రితం ప్రైవేట్‌ వ్యాపారికి విక్రయించాను. రంగు మారిందని క్వింటాకు రూ.5 వేల చొప్పున కొనుగోలు చేశాడు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్లే ప్రైవేట్‌ వ్యాపారిని ఆశ్రయించాల్సి వచ్చింది.

–కె.సిద్ధులు, రైతు, బహుద్దూర్‌పేట

తెల్లబంగారం.. దళారులపరం! 1
1/6

తెల్లబంగారం.. దళారులపరం!

తెల్లబంగారం.. దళారులపరం! 2
2/6

తెల్లబంగారం.. దళారులపరం!

తెల్లబంగారం.. దళారులపరం! 3
3/6

తెల్లబంగారం.. దళారులపరం!

తెల్లబంగారం.. దళారులపరం! 4
4/6

తెల్లబంగారం.. దళారులపరం!

తెల్లబంగారం.. దళారులపరం! 5
5/6

తెల్లబంగారం.. దళారులపరం!

తెల్లబంగారం.. దళారులపరం! 6
6/6

తెల్లబంగారం.. దళారులపరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement