జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు

Oct 5 2025 9:06 AM | Updated on Oct 5 2025 11:23 AM

జనహృద

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు

తుంగతుర్తిలో ముగిసిన మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు

తమ అభిమాన నేతను కడసారి

చూసేందుకు తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు

జోహార్‌ దామన్న అంటూ అశ్రునివాళి

హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి,

లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు

తుంగతుర్తి: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న జనహృదయనేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తన గడి వెంట ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గౌరవసూచకంగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆర్డీఆర్‌ కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. ఉమ్మడి జిల్లాలో తిరుగులేని నేతగా పేరు గడించిన దామన్నను కడసారి చూసేందుకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు, అభిమానులు, పార్టీశ్రేణులు తరలివచ్చారు. తమ అభిమాన నేతను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. జోహార్‌ దామన్న అంటూ నినాదాలు చేశారు.

ప్రముఖుల శ్రద్ధాంజలి

అంత్యక్రియల్లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వృద్ధులు వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, నలగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్యేలు మందుల సామేలు, పద్మావతిరెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్‌, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే అనిల్‌రెడ్డి రాజేందర్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు సంకేపల్లి సుధీర్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌, మాజీ ఎంపీలు హన్మంతరావు, బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్‌, ఉప్పల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి, సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వేణారెడ్డి, మహిళా కాంగ్రెస్‌ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు పోతు భాస్కర్‌, టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌పవార్‌, ఎస్పీ నరసింహ, పలువురు ప్రముఖులు ఆర్డీఆర్‌ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలిఘటించారు.

శోకసంద్రంలో తుంగతుర్తి

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి తుంగతుర్తి ప్రజలతో పాటు, ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. జనహృదయనేతను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. దామోదర్‌ రెడ్డి పార్థివదేహం శుక్రవారం రాత్రి తుంగతుర్తిలోని స్వగృహానికి చేరే వరకు వేచి ఉన్నారు. అలాగే శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నివాళులర్పించారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు.

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు1
1/4

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు2
2/4

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు3
3/4

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు4
4/4

జనహృదయనేతకు కన్నీటి వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement