దామన్న యాదిలో.. | - | Sakshi
Sakshi News home page

దామన్న యాదిలో..

Oct 4 2025 6:30 AM | Updated on Oct 4 2025 6:32 AM

9 ఎకరాలలో గడి ఏర్పాటు

లక్కీ బ్యాగ్‌

తుంగతుర్తిలో 9 ఎకరాల్లో విశాలమైన ప్రాచీన గడి ఉంది. దామోదర్‌రెడ్డి ఇందులోనే ఉండేవారు. గడి చుట్టూ ప్రహరీ నిర్మించి సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయించారు. గడి చుట్టూ పామాయిల్‌ తోటలు, పండ్ల తోటలు సాగు చేసేవారు. ఈ మధ్య కాలంలోనే గడిని ఆధునీకరించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆయన మార్కెట్‌లోకి వచ్చిన కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు. ట్రాక్టర్లు, జిప్సీలు, వ్యాన్‌లపై ఎక్కువ మక్కువ ఉండేది. ఏ ఒక్క వాహనాన్ని అమ్మకుండానే గడి ముందు ఉంచారు.

తిరుమలగిరి (తుంగతుర్తి) : కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రికార్డు సృష్టించిన వ్యక్తి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి. ఖమ్మం జిల్లా లింగాల గ్రామానికి చెందిన ఆయన తుంగతుర్తికి చెందిన ఉప్పునూతల కౌసల్యాదేవి రెండవ కుమార్తె వరూధిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిర పడ్డారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీదే ఆధిపత్యం ఉండేది. దామోదర్‌రెడ్డి కమ్యూనిస్టుల ఆదిపత్యాన్ని తగ్గించి వరుసగా 1985, 1989, 2004లో గెలుపొందారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో జిల్లాలో 11 నియోజకవర్గాలలో టీడీపీ మిత్ర పక్షాల అభ్యర్థులు గెలుపొందగా దామోదరరెడ్డి ఒక్కరు మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌ పక్షాన నిలబడ్డారు. 1992లో నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి, 2004లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రుల హయాంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు.

అధునాతన పంటల సాగుపై ఆసక్తి

మాజీ మంత్రి దామోదర్‌రెడ్డికి పశు సంపద, వ్యవసాయం అంటే చాలా ఆసక్తి. తుంగతుర్తిలోని 130 ఎకరాల్లో అల్లనేరేడు, సపోట, మామిడి, పామాయిల్‌ తోటలు వేశారు. అలాగే కూరగాయల సాగు చేశారు. ఈ ప్రాంత రైతులకు నూతన పంటలపై అవగాహన కల్పించి వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించేవారు. అదేవిధంగా ఎడ్ల గిత్తలను పెంచి వాటికి శిక్షణ ఇప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగే ఎడ్ల పందెంలో పోటీ చేయించేవారు. రాంరెడ్డి బ్రదర్స్‌ ఎడ్ల గిత్తలకు మంచి పేరు ఉండేది. ఎడ్ల గిత్తల స్పెర్మ్‌తో మేలు జాతి పశువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా వివిధ దేశాల నుంచి శునకాలను తీసుకువచ్చి శిక్షణ ఇప్పించి పోటీల్లో ఉంచేవారు.

వ్యవసాయమంటే మక్కువ

దామోదర్‌రెడ్డికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలనే సాకుతో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలకు శంకుస్థాపన చేసి వదిలేశారు. 1999లో అప్పటి సీఎల్‌పీ నేత పి.జనార్దన్‌రెడ్డితో కలిసి దామోదర్‌రెడ్డి శిలా ఫలకం వద్ద రక్తతర్పణం చేశారు. అలాగే వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే శిలాఫలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. 2004లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జల యజ్ఞంలో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలకు నిధులు కేటాయింపజేసి కాల్వ పనులు పూర్తి చేయించారు. 2009లో ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా గోదావరి జలాలను విడుదల చేయించారు. ఈ కాల్వల ద్వారా జిల్లాకు వందల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ఉండేవారు. ప్రచారం జరిగిన ప్రతిరోజు చేతికి లెదర్‌ బ్యాగ్‌ ఉండేది. ఆయన ఇది తనకు సెంటిమెంట్‌గా భావించేవారు. ప్రచారంలో పార్టీ ముఖ్య నాయకులను, ప్రజలను కలిసే సమయంలో ఈ బ్యాగ్‌ ఉండడంతో ప్రజలంతా బ్యాగ్‌ను ఆసక్తిగా చూసేవారు. అందులో ఏం ఉందోనని చర్చించుకునేవారు. కొందరు డబ్బులు ఉండి ఉంటాయని.. మరికొందరు పిస్టల్‌ ఉంటుందని చర్చించుకునేవారు.

ఫ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

ఫ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి

ఎనలేని కృషి

దామన్న యాదిలో..1
1/7

దామన్న యాదిలో..

దామన్న యాదిలో..2
2/7

దామన్న యాదిలో..

దామన్న యాదిలో..3
3/7

దామన్న యాదిలో..

దామన్న యాదిలో..4
4/7

దామన్న యాదిలో..

దామన్న యాదిలో..5
5/7

దామన్న యాదిలో..

దామన్న యాదిలో..6
6/7

దామన్న యాదిలో..

దామన్న యాదిలో..7
7/7

దామన్న యాదిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement