
శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించి, కలశోద్వాసన పూజ జరిపించారు. సాయంత్రం 5.30గంటలకు విజయదశమి వేడుక, శమీ పూజతో ఉత్సవాలు ముగించారు.