
చికిత్స పొందుతూ మహిళ మృతి
డిండి: బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న మహిళ శుక్రవారం మృతి చెందింది. గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రానికి చెందిన ఈరటి ఆంజనేయులు, ఈరటి అంజనమ్మ(30) దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అంజనమ్మ మూడవ సంతానంలో భాగంగా గర్భిణి కావడంతో డెలివరీ నిమిత్తం గత నెల 6న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు డెలివరీ కావడంతో పాప పుట్టింది. అంజనమ్మకు రక్తం తక్కువగా ఉండడంతో వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించారు. గంట తర్వాత అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనమ్మ శుక్రవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కల్వకుర్తి ఆస్పత్రిలోని వైధ్యుల నిర్లక్ష్యం కారణంగానే అంజనమ్మ మృతి చెందినందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.