
యాదగిరీశుడి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి విజయదశమి సందర్భంగా గురువారం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చక బృందం ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ రవి నాయక్ లడ్డూప్రసాదం అందజేశారు.
ఆండాళ్ అమ్మవారికి
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని జరిపించారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం నిర్వహించారు.
స్వర్ణగిరీశుడికి
సూర్యప్రభ వాహన సేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, స్వామి వారికి పద్మావతి అమ్మవార్లకు నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం పెద్ద శేషవాహన సేవ, పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిపించారు. అంతకు ముందు స్వామి వారికి ఏకాదశి సందర్భంగా స్వామి వారికి నవకలశ పంచామృతభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
మినీ శిల్పారామంలో
దసరా ఉత్సవాలు
భువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆలేరుకు చెందిన డ్యాన్స్ టీచర్ దుర్గారావు ఆధ్వర్యంలో కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు.

యాదగిరీశుడి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి

యాదగిరీశుడి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి

యాదగిరీశుడి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి