
అర్వపల్లిలో పూజలు చేశాకే ఎన్నికల ప్రచారం
అర్వపల్లి: మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఇలవేల్పు దైవం. దామోదర్‌రెడ్డి అత్త ఉప్పునూతల కౌసల్యాదేవి పూర్వీకులు అప్పట్లో 750 ఎకరాల భూమిని అర్వపల్లి ఆలయానికి దానం చేశారు. దామోదర్‌రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతిసారి బీఫామ్‌తో ఇక్కడి ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రతి ఏటా ఇక్కడి ఆలయంలో స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కల్యాణోత్సవానికి దామోదర్‌రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపిస్తారు. వారి కుటుంబం ఏ మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఇక్కడి ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేసి పనులు ప్రారంభిస్తారు.
1985కు ముందు తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉండేది. ఆర్డీఆర్ ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రతి గ్రామంలో రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించారు. గోదావరి జలాలు తీసుకువచ్చి కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.
– దరూరి యోగానందచారి, డీసీసీ ఉపాధ్యక్షుడు
40 ఏళ్లుగా నేను దామోదర్‌రెడ్డి వెంటే ఉన్నా. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు ఆయన బాగోగులు చూసుకునేవాడిని. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. తుంగతుర్తిలో శాశ్వతంగా ఉండటానికి ఏడాది కిందట గడీని మరమ్మతు చేయించుకొని ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. ఆయన గుర్తులు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటకీ మరిచిపోలేరు.
– పెండెం రామ్మూర్తి, సీనియర్ నాయకుడు

అర్వపల్లిలో పూజలు చేశాకే ఎన్నికల ప్రచారం

అర్వపల్లిలో పూజలు చేశాకే ఎన్నికల ప్రచారం