
నేడు విజయదశమి
భువనగిరి, యాదగిరిగుట్ట: దసరా పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.శమి, ఆయుధ పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం, ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం ఈ పండుగ ప్రత్యేకత. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు.
కిక్కిరిసిన మార్కెట్‌లు, దుకాణాలు
కొనుగోలుదారులతో మార్కెట్‌లు సందడిగా మారా యి. జీఎస్టీ తగ్గడంతో బైకులు, కార్లు కోనుగోలు చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపారు.
గుట్ట క్షేత్రంలో శమీ పూజ
దసరా పండుగను పురస్కరించుకొని గురువారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట శమీపూజ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30గంటలకు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా భక్తుల మధ్య శమీపూజ జరిపిస్తారు.