
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ మార్చగలిగే శక్తి
కోదాడరూరల్ : దేశ భవిష్యత్‌ను మార్చగలిగే శక్తి యువత చేతిలోనే ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని లాల్ బంగ్లాలో నిర్వహించిన పీవైఎల్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరగుతున్న మతోన్మాద రాజకీయాలను యువత తిప్పికొట్టాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం పేద దేశాలపై ఆదిపత్యం చెలాయిస్తోందని అలాంటి దేశానికి మోదీ ప్రభుత్వం స్వాగతం పలకడం సిగ్గుచేటన్నారు. న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకుడు గౌని ఐలయ్య మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను, యువతను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోకాళ్ల రమేష్, కోలా లక్ష్మీనారాయణ, ప్రజా చైతన్య వేదిక నాయకులు రాయపూడి చిన్ని, ఉపాధ్యక్షులు వనమాల సత్యం, రమేష్, బేజాడి రవికుమార్, రవి, సిద్ధేశ్వర్, ధరావత్ రవి, నల్గొండ నాగయ్య, బండి రవి, మోతీలాల్, బీవీ చారి, సిద్దులు, ఉమాశంకర్, మనోహర్, నరసింహారావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఫ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య