
పరిమితికి మించి ఆటోలో ప్రయాణం
చౌటుప్పల్ : పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తున్న ఆటోను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆపి డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను శుక్రవారం మునుగోడు క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే తన కాన్వాయ్‌తో వస్తున్నారు. అదే సమయంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామ శివారులో నారాయణపురం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటోను చూసి తన కాన్వాయ్‌ను ఆపి ఆటో వద్దకు చేరుకున్నారు. చంటి బిడ్డలతో వెనుక డోర్‌పై ప్రమాదకరంగా ఎందుకు కూర్చుంటున్నారని అడిగారు. ప్రయాణికులను ఆటోలో పరిమితికి మించి ఎందుకు ఎక్కించుకున్నావని డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఆటో సడెన్‌గా బ్రేక్ వేస్తే వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులు కింద పడిపోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు.
ఫ ఆటోడ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి