
సాగర్ వద్ద హైవేపై విరిగిపడిన కొండ చరియలు
నాగార్జునసాగర్: శిరోంచ–రేణిగుంట హైవే, నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి దారిలో కొండ చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. బండరాళ్లు రోడ్డువెంట గల డ్రైన్ రిటైనింగ్ సైడ్‌వాల్‌కు తగలడంతో పాక్షికంగా దెబ్బతిన్నది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం రావడంతో కొండప్రాంతమంతా నానింది. మట్టి కరిగి బండరాళ్లు రోడ్డుపైకి వచ్చాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పోలీసులు బండరాళ్లను ఎత్తి సైడ్ డ్రైన్‌లోకి దొర్లించారు.