
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శనీయం
చౌటుప్పల్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. చౌటుప్పల్‌కు చెందిన నిర్మాత చిరందాసు ధనుంజయ్య, పోచంపల్లికి చెందిన దర్శకుడు బడుగు విజయ్‌కుమార్‌లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన యూనిటీ, ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని శుక్రవారం ప్రముఖ రచయిత మసన చెన్నప్పతో కలిసి హైదరాబాద్‌లో విడుదల చేశారు. శనివారం జరగనున్న బాపూజీ జయంతికి డాక్యుమెంటరీని అంకితం ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.