
మధురం.. సీతాఫలం
సీతాఫలాలు రెండు నెలలపాటు లభిస్తాయి. చెట్టుచెట్టుకు తిరిగి పండ్లు సేకరిస్తాం. వీటిని రోజుకు రూ. 200 నుంచి రూ. 300 వరకు వస్తాయి. వ్యాపారులు మా దగ్గర సీతాఫలాలను తక్కువ ధరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌కు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటారు.
– కర్రె లక్ష్మి, రాజాపేట మహిళా కూలీ
రాజాపేట : సీతాఫలాలంటే ఇష్టపడని వారుండరు. సెప్టెంబర్ చివరివారం నుంచి మొదలుకుని నవంబర్ వరకూ ఈ ఫలాలు విరివిగా లభిస్తాయి. కురిసిన వర్షాలను బట్టి సీతాఫలాలు లభిస్తుంటాయి. సీతాఫలాలు ఎంతో ఆరోగ్యకరం. చిన్నా, పెద్దా తేడాలేకుండా ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిలో గ్లూకోజ్, మిటమిన్ సీ, ఏ, బీ6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటిఆక్సిడెంట్లు, పిండిపదార్థాలు మెండుగా ఉంటాయి. పోషక విలువలతో కూడిన సీతాఫలాలు తీసుకుంటే శరీరం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇవి తేలికగా జీర్ణం కావడంతోపాటు పోషక పదార్థాలు సమృద్ధిగా అందుతాయని పేర్కొంటున్నారు.
రైతు కూలీలకు జీవనోపాధి
సీతాఫలాలు అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విరివిగా వచ్చేసాయి. ఈ సీతాఫలాలతో కొందురు రైతుకూలీలు జీవనోపాధి పొందుతారు. రాజాపేట మండలంలోని సింగారం, పుట్టగూడెం, కొండేటిచెర్వు, మల్లగూడెం, చల్లూరు, నర్సాపురం, బొందుగుల తదితర గ్రామాల్లో ఎక్కువగా సీతాఫలాలు లభిస్తుంటాయి. కూలీలు తమ వ్యవసాయ పొలాల వద్ద ఫలాలను సేకరించే పనిలో ఉంటారు. ఒక్క బాక్స్‌ను రూ.300 వరకు విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన సీతాఫలాలు హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సిద్దిపేట వంటి ప్రదేశాలకు ఎగుమతి చేస్తారు. వ్యాపారులు మాత్రం పట్టణాల్లో రూ.700 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తుంటారు.
సీతాఫలాలను వాహనంలో తరలిస్తున్న రైతులు
విక్రయానికి సిద్ధంగా ఉంచిన సీతాఫలాలు
ఫ రుచితోపాటు ఆరోగ్యానికి మేలు
ఫ ప్రారంభమైన పండ్ల విక్రయాలు

మధురం.. సీతాఫలం

మధురం.. సీతాఫలం

మధురం.. సీతాఫలం