
డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 ఉద్యోగం
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా గ్రూప్–1 తుది ఫలితాల్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికై ంది. చిన్నప్పటి చదువులో ముందుండే జువేరియా కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో 2023లో డిగ్రీ(బీఎస్సీ మ్యాథ్స్) పూర్తిచేసి గోల్డ్‌మెడల్ అందుకుంది. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగానే దరఖాస్తు చేసుకొని సొంతంగా ప్రిపేర్ అయ్యి మొదటి ప్రయత్నంలోనే అసిస్టెంట్ టెజ్రరీ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. జువేరియా అక్క సుమయ్య పర్వీన్ కూడా డీఎస్సీ సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్‌జీటీగా పనిచేస్తోంది.
కలెక్టర్ కావడమే లక్ష్యం
గ్రూప్–1లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించడం ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. ఆ వెంటనే దానికి అవసరమైన మెటీరియల్‌ను యూట్యూబ్, నెట్ ద్వారా సేకరించుకున్నాను. ఆయా మెటీరియల్స్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించుకుని రోజుకు 12 నుంచి 14 గంటలు చదివాను. భవిష్యత్తులో సివిల్స్ రాసి కలెక్టర్ కావడమే నా లక్ష్యం. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. – జువేరియా