
రిజర్వ్ మద్యం షాపులకు డ్రా
సాక్షి,యాదాద్రి: మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని 30 మద్యం దుకాణాలను రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. నాలుగు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 82 మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో 30 దుకాణాలను ప్రభుత్వం రిజర్వ్ చేసింది. గౌడ సామాజిక వర్గానికి 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 కేటాయించగా, 52 జనరల్ కేటగిరీలో ఉన్నాయి. గురువారం తన చాంబర్‌లో కలెక్టర్ హనుమంతరావు లక్కీడ్రా తీశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, బీసీ సంక్షేమ అధికారి సాహితీ, ఎస్సీ సంక్షేమ అధికారి జింకల శ్యాంసుందర్, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
నూతన మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు నాన్ రిఫండబుల్ ఫీజు గతంలో రూ.2లక్షలు ఉండగా ఈసారిరూ.3 లక్షలు నిర్ణయించారు. అక్టోబర్ 23న డ్రా తీయనున్నారు. షాపులు దక్కించుకున్నవారు అక్టోబర్ 24వ తేదీ సాయంత్రలోపు రెంటల్ మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించాలి. డిసెంబర్ 1న షాపులను ప్రారంభించాలి. ఆరోజు నుంచి రెండేళ్ల కాలానికి పరిమితి ఉంటుంది.
ఫ ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్‌కు 30 షాపులు
ఫ జనరల్ కేటగిరీలో 52 కేటాయింపు