
యాదగిరిగుట్ట ఆలయ ఈఓగా రవినాయక్?
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇంచార్జి ఈఓగా ఐఏఎస్ అధికారి జి.రవినాయక్ రానున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఈఓ వెంకట్రావ్ వ్యక్తిగత సెలవుల్లో వెళ్లనున్నారు. ఆయన స్థానంలో స్థానంలో కాలుష్య నియంత్రణ మండలి బోర్డు కార్యదర్శి రవినాయక్ రానున్నారని, రెండు రో జుల్లో బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. కాగా ఈ విషయంపై ఆలయ అధికార వర్గాలు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రవినాయక్ గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
నేడు హరీష్‌రావు రాక
యాదగిరిగుట్ట రూరల్ : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు గురువారం యా దగిరిగుట్టకు రానున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం వేకువజామున 5.30కి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. అనంతరం వైకుంఠద్వారం వద్ద పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి యాదగిరి కొండపైకి వెళ్లి శ్రీస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటార పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి తెలిపారు.
స్నేహ కమిటీలు ఏర్పాటు చేయాలి
భువనగిరిటౌన్ : ప్రతి గ్రామంలో 5 నుంచి 15 మంది సభ్యులతో స్నేహ కమిటీలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న స్నేహ కార్యక్రమంపై బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లాస్థాయి అవగాహన, సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 15–18 ఏళ్ల వయసు గల యువతీయువకులకు భద్రత, పోషకాహారం, సాధి కారత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించడమే కాకుండా, వారి చదువు కొనసాగింపు, ఉపాధి నైపుణ్యాలు, ఆర్థిక స్వావలంబన వైపు దారితీసే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాస్థాయి సమన్వయ కమిటీ డీఆర్‌డీఓ, మహిళాశిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పోలీస్, పంచాయతీరాజ్, కార్మిక, నైపుణ్యాభివృద్ధి తదితర విభాగాలు కలసి కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 5 నుంచి 15 మంది సభ్యులతో స్నేహ సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, ఎస్సీ సంక్షేమ జిల్లా అధికారి శ్యాంసుందర్, ఉపాధి కల్పనా అధికారి పరాంకుశం సాహితి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బతుకమ్మ పాటకు అవార్డు
భువనగిరి: పట్టణానికి చెందిన బండారు పుష్పలతకు కవియిత్రి అవార్డు లభించింది. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో జిల్లా నుంచి ఆమె పాల్గొని ‘బతుకునిచ్చిన బతుకమ్మ’ పాట పాడారు. ఇందుకుగాను ఆమెకు కవియిత్రి అవార్డును ప్రకటించారు. ప్రముఖ కవి రాములు చేతుల మీదగా అవార్డు అందుకున్నారు.

యాదగిరిగుట్ట ఆలయ ఈఓగా రవినాయక్?