
బుద్ధవనంలో నేడు బతుకమ్మ సంబరాలు
డీసీఎంలోని కొబ్బరిబోండాలను ఎత్తుకెళ్లిన ప్రజలు
సూర్యాపేటటౌన్: లారీని ఓవర్‌టేక్ చేయబోయి డీసీఎం బోల్తా పడింది. డీసీఎంలోని కొబ్బరిబోండాల కోసం జనం ఎగబడ్డారు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం మట్టపల్లిలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ లోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ సూర్యాపేట మండలం రాయినినగూడెం సమీపంలోకి రాగానే ఏపీలోని ఏలూరు నుంచి కొబ్బరిబోండాల లోడుతో వస్తున్న డీసీఎం ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం జాతీయ రహదారి పక్కకు పడిపోవడంతో కొబ్బరిబోండాలు కిందపడిపోయాయి. దీంతో రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు డీసీఎంలోని కొబ్బరిబోండాలను ఎత్తుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. లారీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట రూరల్ పోలీసులు తెలిపారు.