
ఉధృతంగా ప్రవహిస్తున్న డిండి వాగు
చందంపేట: డిండి ప్రాజెక్టు అలుగు పోస్తుండడంతో డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో చందంపేట మండలంలోని మన్నెవారిపల్లి, సిద్ధాపురం, బక్కలింగాలపల్లి, అక్కారం, ఐనూర్, బొమ్మన్‌పల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల వారు ఏదైనా అవసరమైతే దేవరకొండకు వచ్చేవారు కానీ.. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అచ్చంపేటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా దేవరకొండ నుంచి మద్దిమడుగు మీదుగా శ్రీశైలం వెళ్లే వాహనాలు డిండి మీదుగా వెళ్తున్నాయి. 25 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నిలిచిన రాకపోకలు