
క్యాంపు కార్యాలయం ముట్టడి.. నిర్వాసితుల అరెస్టు
నల్లగొండ: రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాగా.. రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న గట్టుప్పల్ మండలానికి చెందిన పలువురు రైతులు మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే భూనిర్వాసితులు నల్లగొండకు రాకుండా ముందస్తుగానే కొంతమందిని గట్టుప్పల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కొందరు నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి రాగా.. వారిని కూడా నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి అనంతరం వదిలేశారు. తమకు మార్కెట్ ధర కట్టించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాము మంత్రితో మాట్లాడతామని భూనిర్వాసితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.