
వాగు దాటలేకపోతున్నాం
ప్రతి సంవత్సరం వానా కాలం కొలనుపాక వాగు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం, ఆటోలో స్కూల్ విద్యార్థులతో వాగు దాటే క్రమంలో బయపడుతున్నాం, ఏ చిన్న పనికై నా ఆలేరు పట్టణానికి వెళ్లాలి. ఏళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులు, నాయకులను వేడుకుంటున్నాం ఓట్ల కోసం వస్తారే తప్పా.. సమస్యను పట్టించుకోరు.
– దూడల కృష్ణ, కొలనుపాక
కొలనుపాక నుంచి సిద్దిపేటకు ప్రధాన రహదారిగా ఉంది. వాగు దాటే క్రమంలో వాహనాలు జారిపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు గతంలో హామీలిచ్చినా నీటి మూటలాగే మిగిలిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకొని వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. – గడ్డ నాగరాజు కొలనుపాక
●

వాగు దాటలేకపోతున్నాం