
ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
భువనగిరి: ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యూత్ ఫెస్ట్–2025, 5కే రెడ్ రన్ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు క్విజ్ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్ తెలిపారు. అంతకుముందు 5కే రెడ్ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ సాయిశోభ, సంపతయ్య, ముత్యాలు, చంద్రమౌళి, సతీష్, నర్సింహ, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హెపటైటిస్ ‘బి’ వ్యాక్సిన్‌తో
వ్యాధుల నుంచి రక్షణ
హెపటైటిస్ ‘బి’ వ్యాక్సిన్‌తో జీవితకాల కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో అందుబాటులో ఉందన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ సాయిశోభ, డాక్టర్ యశోధ, మధురిమ, స్వప్నరాథోడ్, సృజన, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
అధికారి డాక్టర్ మనోహర్