
దళితుల ద్రోహిగా మిగిలిన కేసీఆర్
● ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
● గతంలో కేసీఆర్ చేసిన వర్టూర్ గ్రామంలోనే
పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే
మోటకొండూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను పూర్తిగా విస్మరించి పాలన సాగించి దళిత ద్రోహిగా మిగిలారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం మోటకొండూర్ మండలంలోని వర్టూర్ గ్రామంలోని దళిత వాడలో ఆయన పల్లె నిద్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009 తెలంగాణ ఉద్యమ సమయంలో మోటకొండూర్ మండలంలోని వర్టూర్ గ్రామంలోని దళిత వాడలో కేసీఆర్ పల్లె నిద్ర నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రం సిద్దిస్తే 60 దళిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.5 వేల నగదు ఇస్తామని హామీలు అమలు చేయకుండా పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అదే దళితవాడలో కేసీఆర్ పల్లెనిద్ర చేసిన ఇంటి వద్దే తాను పల్లె నిద్ర చేసి దళితులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దళిత వాడలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం వారితో కలిసి సామూహిక సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య, ఆలేరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరిగౌడ్, మండల అధ్యక్షులు గంగాపురం మల్లేష్, పచ్చిమట్ల మదార్‌గౌడ్, నెమ్మాణి సుబ్రమణ్యం, తండ రంగయ్య గౌడ్, కొంతం మోహన్‌రెడ్డి, మోర శ్రీనివాస్‌రెడ్డి, పల్లె శ్రీనివాస్, భూమండ్ల శ్రీనివాస్, బుగ్గ కొమురయ్య, జూకంటి మధు, గువ్వ హరిబాబు, పేరబోయిన కార్తీక్, బుగ్గ శ్రీశైలం, వంగాల మల్లేష్‌గౌడ్, రామకృష్ణ పాల్గొన్నారు.