
యాదాద్రి ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభం
నిడమనూరు : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి చౌటుప్పల్ వద్ద (92.378 కిలోమీటర్ల దూరం) ఉన్న విద్యుత్ టవర్లకు మంగళవారం కేబుల్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా ప్రారంభించినట్టు ట్రాన్స్‌కో ఏఈ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా నిడమనూరు మండల పరిధిలోని రైతులు వరిపొలాల మీదుగా వెళ్తున్న 400 కేవీ విద్యుత్ లైన్ తీగలను తాకవద్దని సూచించారు. ఈ లైన్ మొత్తం దామరచర్ల మండలంలో తిమ్మాపురం, వీర్లపాలెం, త్రిపురారం మండలంలో అంజనపల్లి, నీలాయిగూడెం, అన్నారావుక్యాంపు, రాగడప, నిడమనూరు మండలం నిడమనూరు, బంకాపురం, శాఖాపురం, పార్వతీపురం, రాజన్నగూడెం, నారమ్మగూడెం, వెనిగండ్ల, పనసయ్య క్యాంపు, తుమ్మడం, అనుముల మండలంలో మారేపల్లి, నారాయణపురం, యాచారం, కుపాసిపల్లి, పాలెం, రామడుగు, శ్రీనాథపురం, చింతగూడెం, గుర్రంపోడు మండలంలో కొప్పోలు, కనగల్ మండలంలో రేగట్టే, కుర్రంపల్లి, జీ ఎడవెల్లి, పొనుగోడు, కనగల్, గౌరారం, తుర్కపల్లి, లచ్చుగూడెం, చండూరు మండలంలోని ఉడుతలపల్లి, బోడంగిపర్తి, మునుగోడు మండలంలోని పాల్వాయి, కిష్టాపురం, ఇప్పర్తి, చీకటిమామిడి, మునుగోడు, కమ్మగూడెం, చొల్లేడు, సోలిపురం, కొరటికల్ నుంచి చిట్యాల మీదుగా చౌటుప్పల్ వరకు 92.378 కిలోమీటర్ల పొడవున ఉందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ టవర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, టవర్లను ఎక్కకూడదని, టవర్ల కింద ఏపుగా పెరిగే మొక్కలు నాటవద్దని పేర్కొన్నారు.
చౌటుప్పల్ వద్ద టవర్లకు
400కేవీ లైన్ ద్వారా సరఫరా
తీగలను తాకకుండా రైతులు
జాగ్రత్తగా ఉండాలి
ట్రాన్స్‌కో ఏఈ ప్రవీణ్‌కుమార్ సూచన