
ఆలకించి.. పరిష్కారానికి హామీ ఇచ్చి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు అందజేశారు. కలెక్టర్ హనుమంతరావు అర్జీలను స్వీకరించడంతో పాటు వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి సమస్యను నమోదు చేయించి వినతిపత్రాలను ఆయా శాఖలకు పంపించారు. జాప్యం చేయకుండా సత్వరపరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 57 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ 34, పంచాయతీరాజ్ 5, శిశు సంక్షేమ 4, సర్వే ల్యాండ్ 2, గ్రామీణాభివద్ధి 2, వైద్యారోగ్య 2, ఎంపీడీఓ పో చంపల్లి 2, మున్సిపాలిటీ, అగ్రికల్చర్, విద్య, ఇరిగే షన్, రెసిడెన్షియల్ స్కూల్, ఆర్టీసీ ఒక్కొక్కటికి చొ ప్పున ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్‌ఓ జయమ్మ, హౌసింగ్ పీడీ విజయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్
ఫ సత్వర పరిష్కారానికి ఆదేశం