
అదే గోస.. అదే యాతన
మోత్కూరు: అదును దాటుతున్నా రైతులకు యూ రియా తిప్పలు తప్పడం లేదు. మోత్కూరులోని పీఏసీఎస్, ఫర్టిలైజర్ల వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులుదీరారు. పీఏసీఎస్‌కు 444, మన గ్రోమోర్‌కు 444, శ్రీరామ ఫర్టిలైజర్స్‌కు 150, బాలాజీ ఫర్టిలైజర్స్‌కు 150, లక్ష్మీనర్సింహ ఫర్టిలైజర్స్‌కు 70, పాటిమట్ల ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న మన గ్రోమోర్‌కు 444 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. ముందుగానే రైతులకు టోకెన్లు అందజేసిన అధికారులు.. ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాలు పంపిణీ చేశారు.