
చాలా గర్వంగా ఉంది
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు మర్యాల స్కూల్ కేరాఫ్‌గా నిలువడం గర్వంగా ఉంది. గత సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాం. గతంలో మండల టాపర్‌గా నిలిచాం. తమ పాఠశాల విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్స్ సైతం రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. మర్యాల పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. దాతలు సహకరిస్తే మరిన్ని వసతులు సమకూరి విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతాయి.
– పగిడిపల్లి నిర్మలజ్యోతి, హెచ్‌ఎం
●