
ఆటల్లోనూ మెరికలే..
జాతీయ, రాష్ట్ర స్థాయికి మర్యాల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికై న విద్యార్థినులు నిహారిక,
సంధ్య
జాతీయ స్థాయికి వెళ్లింది వీరే..
2011లో మర్యాల గ్రామానికి చెందిన
ఎండీ.అస్మా కౌసర్
2014 కాండ్లకుంట తండాకు చెందిన వైజయంతి జాతీయస్థాయిక ఖోఖో పోటీల్లో ప్రాతినిథ్యం వహించారు.
సైన్స్‌ఫెయిర్‌లోనూ సత్తా చాటారు
పాఠశాల విద్యార్థులు సైన్స్‌ఫెయిర్‌లో సైతం సత్తా చాటారు. దివ్యాంగులకు ఉపయోగపడేలా రూపొందించిన బస్సు రాష్ట్రస్థాయికి ఎంపికై ంది.
టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత
2024–25 విద్యా సంవత్సరంలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో మర్యాల జిల్లా పరిషత్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంలోనూ ఈ పాఠశాల విద్యార్థులు మండల, జిల్లా టాపర్లుగా నిలిచారు.
పర్యావరణ పరిరక్షణకు సైతం..
చదువు, ఆటల్లోనే కాకుండా పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు కృషి చేస్తున్నారు. చెట్ల ప్రాధాన్యత తెలిసేలా పాఠశాల ఆవరణలో తరగతి గదుల వెంట వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేశారు.
పోటీలు ఎక్కడ జరిగినా
విజయం వారిదే..
సైన్స్ ఫెయిర్‌లోనూ రాష్ట్ర స్థాయికి
పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రధానోపాధ్యాయురాలు నిర్మలజ్యోతి
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరుస్తూనే క్రీడల్లోనూ రాణిస్తున్నారు. అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ, పట్టుదలతో సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో సత్తా చాటుతున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులను ఆటల వైపు ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. హెచ్‌ఎం నిర్మల జ్యోతి.
పలుమార్లు రాష్ట్ర స్థాయికి..
2024 సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరిగిన రాష్ట్ర సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో దరావత్ దీపిక సత్తా చాటింది.
2024 నవంబర్ 3,4,5 తేదీల్లో కామారెడ్డి జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 బాలికల విభాగం ఖోఖో పోటీల్లో ఉమ్మడి నల్లగొండ తరఫున జగ్గారి హరిస్మా, కె.శ్రేష్ట ప్రతిభ కనబరిచి 68వ రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు.
2024 నవంబర్ 7న సూర్యాపేటలో జరిగిన ఉమ్మడి నల్లగొండ అండర్–17 బాలికల జిల్లాస్థాయి పాఠశాలల ఖోఖో క్రీడల్లో ప్రవళ్లిక, నిహారిక, అక్షయ 68వ రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్–14 బాలుర విభాగంలో ఎల్.నరేష్ రాష్ట్రస్థాయికి ఎంపికై ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు.
2024 డిసెంబర్‌లో భువనగిరిలో జరిగిన అండర్–16 క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీల్లో డి.నిహారిక ప్రథమ, డి.సంధ్య రాణించి నాగర్‌కర్నూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు.
2024 డిసెంబర్‌లో భువనగిరిలో నిర్వహించిన జిల్లాస్థాయి సీఎం కప్ మహిళా కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానం. అక్షిత, శ్రావణి, రేణుకలు రాష్ట్రస్థాయిక పోటీలకు ప్రాతినిథ్యం వహించారు.
జిల్లాస్థాయిలో ఫుట్‌బాట్ పోటీల్లో దీపిక, సోనియా ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక.
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ సాధించిన హరిష్మా, ప్రవళ్లిక, అక్షయ, సంధ్య నిహారిక, చరణ్, నరేష్, దీపక్ రాష్ట్రాస్థాయికి ఎంపిక.
ఖోఖో పోటీల్లో నిహారిక, వేదశ్రీ, చరణ్, గోవింద్ సింగ్ రాష్ట్రస్థాయికి ఎంపిక.

ఆటల్లోనూ మెరికలే..

ఆటల్లోనూ మెరికలే..