
నాన్ ఆయకటు్టకు జలసిరి
ఆలేరు ప్రాంతంలో ఇలా..
చెరువులు, కుంటలు 726
అలుగులు పోస్తున్నవి 180
75–100 శాతం నిండినవి 132
50–75 శాతం నిండినవి 128
25–50 శాతం నీళ్లున్నవి 174
0–25 శాతం.. 100
యాదగిరిగుట్ట రూరల్: నాన్ ఆయకట్టు ప్రాంతమైన ఆలేరు నియోజకవర్గానికి ఈ వానాకాలం ఆలస్యంగానైనా జలసిరి సిద్ధించింది. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరడంతో ఆశావహ పరిస్థితులు నెలకొన్నాయి. 132 చెరువులు అలుగుపోయగా, 132 చెరువులు వంద శాతం నిండాయి. మిగతావి జలకళను సంతరించుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే కళకళలాడాల్సిన పొలాలు చాలా చోట్ల బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. సాగు చేసిన పొలాలకూ సరిపడా నీరందని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కురిసిన వర్షాలు అన్నదాతకు ఊపిరిపోశాయి.
చెరువులే ఆధారం
ఆలేరు నియోజకరవర్గ రైతులు బోర్లు, బావులు, చెరువుల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలోని చెరువులో నీళ్లుంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆయకట్టు సాగవుతుంది. పశుపక్షాధులకు తాగు నీరు లభిస్తుంది. మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుంది. చెరువుల్లో నీరు లేకుంటే ఈ ప్రాంతం ఎడారిని తలపిస్తుంది. బోర్లు ఎండిపోయి పంటలకు నీరందని పరిస్థితి ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల్లోకి భారీగా నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి వరకు వర్షాలు లేక
బీళ్లుగా భూములు
ఆలేరు డివిజన్‌లో సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిగా చెరువులు, బోర్లు, బావుల ఆధారంగానే సాగువుతుంది. సీజన్ ప్రారంభం నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల భూములు సాగుకు నోచుకోలేదు. దీనికి తోడు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆశావహ పరిస్థితులు నెలకొ న్నాయి. మరో భారీ వర్షం కురిస్తే నాన్ ఆయకట్టులో చెరువులన్నీ అలుగుపోసి యాసంగికి సాగునీటి చింత ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. జూన్ వరకు లోటు వర్షపాతం ఉన్నప్పటికీ ఆగస్టులో సాధారణం కంటే అధికంగా నమోదైంది.
భారీ వర్షాలతో చెరువులకు జలకళ
సగానికి పైగా చెరువుల్లో
70 శాతం నీరు
బోర్లు, బావుల్లో పెరిగిన నీటి మట్టాలు
సీజన్ చివరి దశలో పంటలకు ఊపిరి
యాసంగికి ఆశావహ పరిస్థితులు
బోర్లలో నీట్టిమట్టం పెరిగింది
మొన్నటి వరకు బోర్లలో నీళ్లు సరిగా లేవు. వానాకాలం చివరి దశలో ఉన్న పంటలకు వర్షాలు ఊపిరి పోశాయి. చెరువులు, కుంటలు నిండడం వల్ల నీటి మట్టం పెరిగింది. ఇప్పటికై తే నీటి కొరత ఉండదు. సీజన్ ప్రారంభంలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉండగా చెరువులు నిండటంతో పెరిగింది.
– తాళ్ల ఉప్పల్‌రెడ్డి, గుండ్లపల్లి
చేప పిల్లలు పోస్తాం
పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చాలా చెరువులు నిండాయి. గతంలో చెరువుల్లో నీళ్లు సరిగ్గా లేక చేప పిల్లల పెంపకంలో నష్టం వాటిల్లింది. ప్రస్తుతం చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరింది. మా ఊరి చెరువులో చేప పిల్లలు వేయడానికి సిద్ధమయ్యాము. ఆర్థికంగా ఉపాధి లభిస్తుంది. – ఎల్లంల సత్తయ్య, మహబూబ్‌పేట

నాన్ ఆయకటు్టకు జలసిరి

నాన్ ఆయకటు్టకు జలసిరి