
గీతకార్మికుడి నరకయాతన
తాటిచెట్టు ఎక్కే క్రమంలో జారిన మోకు
చెట్టు మధ్యలోనే కదలకుండా ఉండిపోయిన కార్మికుడు
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని జనగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండూరి చంద్రయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కే క్రమంలో మోకు బిగుసుకుపోవడంతో చెట్టు సగం వరకు జారి మధ్యలోనే కదలకుండా ఉండిపోయాడు.
గమనించిన తోటి గీత కార్మికులు కొండూరి యాదయ్య, తొలుపూరి ఇస్తారి చెట్టు ఎక్కి దించేందుకు ప్రయత్నించగా.. వీలు కాలేదు. అంతలోని మరో ఇద్దరు గీత కార్మికులు కందుల లింగస్వామి, కొండూరి కృష్ణయ్య సాయంతో చెట్టు ఎక్కి చంద్రయ్యను క్షేమంగా కిందకు దించారు.