
మెనూ ప్రకారం భోజనం అందించాలి
భువనగిరి, బీబీనగర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. భువనగిరి పరిధి లోని కస్తూరిబా గాంధీ పాఠశాల, కళాశాలను శని వారం ఆయన తనిఖీ చేశారు. కిచెన్, వంట సామగ్రి, భోజనం నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం టమాట, గుడ్డుతో విద్యార్థులకు భోజనం అందించాలి. కానీ, ఆ రెండు మెనూలో లేకపోవడంతో టెండర్‌దారుడికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారంంతో తన కాంట్రాక్ట్ ముగిసిందని సమాధానం చెప్పడంతో కొత్త టెండర్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగాభువనగిరి మండలం వడాయిగూడెం, బీబీనగర్ మండలం గూడూరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు