
నలుగురు లెక్చరర్లకు అవార్డులు
రామగిరి (నల్లగొండ) : ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు అధ్యాపకులు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. నల్లగొండ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అంగోతు హేమ్ల నాయక్ (కెమిస్ట్రీ), ఎన్.ధనమ్మ (ఫిజిక్స్), బి.బాలాజీ (ఇంగ్లిష్), నేరేడుచర్ల జూనియర్ కళాశాల లెక్చరర్ పి.వెంకటరమణ(జువాలజీ) ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో వీరు అవార్డులు అందుకోనున్నారు.
ఇంటింటికీ తిరిగి.. ప్రవేశాలు పెంచి..
నేరేడుచర్ల: నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల జువాలజీ లెక్చరర్, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ పి.వెంకటరమణ తనదైన శైలిలో బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కళాశాలకు రాని విద్యార్థులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి తిరిగిహాజరయ్యేలా చేశారు. ఆయన చేసిన కృషికి విద్యార్థుల సంఖ్య 60 నుంచి 260కి చేరింది. దాతల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని సైతం ఏర్పాటు చేయించారు. సొంత ఖర్చులతో ఎంసెట్, జేఈఈ, నీట్ పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేస్తున్నారు.

నలుగురు లెక్చరర్లకు అవార్డులు

నలుగురు లెక్చరర్లకు అవార్డులు