
27 సంఘాల పదవీకాలం పొడిగింపునకు నో!
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి యాదాద్రి : ఉమ్మడి జిల్లాలో 27 సహకార సంఘాల పాలకవర్గాల పొడిగింపు నిలిచిపోయింది.ఆయా సొసైటీల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో సహకార శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరిలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా ఇందులో చందుపట్ల, వలిగొండ, చౌటుప్పల్, జూలురు పాలకవర్గాలపై ఆరోపణలున్నాయి. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో 43 సొసైటీలు ఉండగా నాలుగు సంఘాలపై, నల్లగొండలో 43 సొసైటీలకు గాను 19 సంఘాలపై ఆర్థికపరమైన ఆరోపణలున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
సహకార సంఘాల బైలాను కాలదన్ని నిబంధనలను విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడం, దుర్వి నియోగం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సహకార సంఘాల సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గాల సభ్యులు సహకారం చట్టానికి విరుద్ధంగా తమ పేరున తీర్మానాలు చేసుకుని తప్పుడు బిల్లులతో లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపిన సహకార శాఖ అధికారులు.. రాష్ట్ర శాఖకు పంపిన నివేదిక ఆధారంగా 27 సొసైటీలపై చర్యలు తీసుకున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
–శ్రీధర్, జిల్లా సహకార అధికారి, భువనగిరి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొసైటీల పాలకవర్గాల పొడిగింపు నిలిపివేశాం. నిధుల దుర్వినియోగం, డైరెక్టర్ల రాజీనామ వంటి విషయాలతో ప్రస్తుతానికి పొడిగింపు ఇవ్వలేదు. ఆరు నెలల పాటు సొసైటీల్లో పర్సన్‌ఇంచార్జ్‌ల పాలన కొనసాగుతుంది.
ఫ సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణలు
ఫ చట్ట విరుద్ధంగా తీర్మానాలు
ఫ తప్పుడు బిల్లులు సృష్టించి రూ.లక్షలు స్వాహా
ఫ 27 సొసైటీల పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు నిలిపివేత
ఫ సహకార శాఖ ఉత్తర్వులు