
విజ్ఞాన్ యూనివర్సిటీకి 70వ ర్యాంక్
ఫ వీసీ నాగభూషణ్
భూదాన్‌పోచంపల్లి: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గురువారం విడుదల చేసిన ఉన్నతస్థాయి విద్యాసంస్థల నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి జాతీయస్థాయిలో 70వ ర్యాంకు సాధించింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ కల్నల్ ప్రొఫెసర్ పి. నాగభూషణ్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. టీచింగ్ లెర్నింగ్ రీసోర్సెస్ రీసెర్చ్ అండ్ ఫ్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్ ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ కేటగిరీల్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీ పనితీరును కేంద్రం పరిశీలించి 100 పాయింట్ల స్కోర్ ప్రామాణికంగా ర్యాంకును కేటాయించిందన్నారు. మెరుగైన ర్యాంకు వల్ల బహుళజాతి కంపెనీల్లో విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పర్చుకుంటూ, పరిశోధనల వల్లనే జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు వచ్చిందని తెలిపారు. ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన ఐక్యూసీ టీమ్‌ను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.