
పరిశోధన పరిభాష తరగతి గదుల్లో ప్రతిధ్వనించాలి
నల్లగొండ టూటౌన్: పరిశోధన పరిభాష తరగతి గదుల్లో ప్రతిధ్వనించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మ్యాథమెటికల్ అప్లికేషన్స్‌పై నిర్వహించిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.గణితశాస్త్రం నిత్య జీవితంలో మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధునిక సమాజ నిర్మాణంలో గణితం పాత్ర విడదీయరానిదని అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ.. సమాజ దశ దిశను నిర్దేశించగల శక్తి ఉన్నత విద్యకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, డి. శ్రీనివాసచార్య, పద్మనాభరెడ్డి, చందూలాల్, మద్దిలేటి, ప్రేమ్‌సాగర్, అన్నపూర్ణ, ఉపేందర్‌రెడ్డి, హైమావతి, విజయ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్