
టిప్పర్ ఢీకొని మృతి
భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ రూరల్: టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన బోళ్ల వెంకటేశ్‌యాదవ్(52) వ్యవసాయంతో పాటు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో తన బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వగ్రామానికి వస్తుండగా.. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ స్జేజీ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్‌యాదవ్ తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడిని కారులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతడి తలకు శస్త్రచికిత్స చేశారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, వివాహితులైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ ఎస్‌ఐ కృష్ణమల్ సూర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.