
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద చెరువు ఒడ్డున బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మృతుడు 5.3 అడుగుల ఎత్తు ఉంటాడని, ఆకుపచ్చ రంగు టీషర్ట్ పైనుంచి నలుపు రంగు చెక్స్ షర్ట్ ధరించినట్లు తెలిపారు. అతడి కుడిచేతికి తాయత్తు ఉందని, చిన్న గడ్డం కూడా ఉన్నట్లు గుర్తించామని ఎస్‌ఐ వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 86011, 87126 86048 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కారు ఢీకొని యువకుడి దుర్మరణం
ఫ మరొకరికి గాయాలు
చిట్యాల: యూటర్న్ తీసుకుంటున్న బైక్‌ను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన దేశపాక శ్రీశాంత్(20), చిట్యాల పట్ట ణానికి చెందిన శివకార్తీక్ మంగళవారం రాత్రి బైక్‌పై చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గల చెరువు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి చిట్యాల వైపు అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీశాంత్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శివకార్తీక్‌ను నార్కట్‌పల్లిలోని కామి నేని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఉమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నల్లబెల్లం, పటిక పట్టివేత
డిండి: అక్రమంగా నల్లబెల్లం, పటిక తరలిస్తున్న వాహనాన్ని బుధవారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని చెర్కుపల్లి నుంచి తవక్లాపూర్ వెళ్లే మార్గంలో ఇండికా కారులో 450 కేజీల నల్లబెల్లం, 30 కేజీల పటికను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి కారును పట్టుకున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు నర్సింహ, వీరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
భువనగిరిటౌన్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వెండి వస్తువులు, నగదు అపహరించారు. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని ఎల్బీనగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు ఫిర్యాదు మేరకు భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా భువనగిరి పట్టణంలోని రాంగనర్ కాలనీ సమీపంలోని సెల్ టవర్ వద్ద బ్యాటరీ, ఇతర వైర్లు చోరీకి గురైనట్లు నిర్వాహకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.