
వినతులిచ్చి.. ఆదుకోవాలని కోరి..
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజవాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. అధికారులకు గోడు చెప్పుకొని, వినతులు అందజేసి, ఆదుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌ఓ జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్‌సింగ్ అర్జీలు స్వీకరించారు. 50 వరకు అర్జీలు రాగా వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 40, పంచాయతీరాజ్ శాఖ 4 , సంక్షేమ, మున్సిపాలిటీ , విద్య, సర్వే ల్యాండ్స్, లీడ్ బ్యాంకు తదితర శాఖలకు సంబంధించివి ఒక్కొకటి చొప్పున ఉన్నాయి. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్లు ఆదేశించారు. పనులు వదులుకొని సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోడ్చి వస్తుంటారని, పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.