
విద్యార్థిగా కలెక్టర్..
బీబీనగర్: కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిగా మారారు. తరగతి గదిలో కాసేపు విద్యార్థులతో కలిసి కూర్చొని ఉపాధ్యాయుడు బోధిస్తుండగా పాఠం విన్నారు. బీబీనగర్ మండలం గూడూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌ను బుధవారం ఆయన సందర్శించారు. 10వ తరగతికి వెళ్లి విద్యార్థులతో కలిసి జూవాలజీ పాఠం విన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులువైన రీతిలో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సైకిళ్లు బహుమతిగా అందజేస్తానని కలెక్టర్ తెలిపారు.