
కాంగ్రెస్‌ది ఓటు బ్యాంకు రాజకీయం
సాక్షి, యాదాద్రి, భువనగిరి : బీసీ రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత గురువారం తొలిసారిగా ఆయన జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా భువనగిరిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడారు. ముస్లిం ఓటుబ్యాంకుతో రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందే తప్ప కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయడం చేతకావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది బీసీ బిల్లు కాదని అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి భారీగా సీట్లు వస్తాయనే సంకేతాలున్నాయన్నారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మూసీ ప్రక్షాళన చేస్తా అనే మాటలు కార్యరూపం దాల్చలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రెండు ఒక్కటేనని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదన్నారు. భువనగిరి నుంచి ధర్మయుద్ధం ప్రారంభించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు అధికారం ఇచ్చిన ప్రజలు ఒకసారి బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. అనంతరం బీజేపీ శ్రేణులు రాంచందర్‌రావును ఘనంగా సత్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రమేందర్‌రెడ్డి, జిల్లా ప్రభారి చాడ శ్రీనివాస్‌రెడ్డి, సంస్థాగత జిల్లా స్థానిక ఎన్నికల ప్రభారి పాశం భాస్కర్,బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు తాడూరి శ్రీనివాస్, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, పోతంశెట్టి రవీందర్, దాసిర మల్లేష్, నర్ల నర్సింగ్‌రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, జాతీయ దళిత మోర్చా కార్యవర్గసభ్యులు వేమలు అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, పట్టణ, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
భారీ బైకు ర్యాలీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఆ పార్టీ నేతలు స్థానిక పాత బస్టాండ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి వినాయక, ప్రిన్స్ చైరస్తా మీదగా ఆజాద్ రోడ్డు మార్గంలో సమ్మద్ చౌరస్తా మీదుగా ఎంఎన్‌ఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు.
ఫ కామారెడ్డి డిక్లరేషన్ అమలు ఎక్కడ
ఫ కార్యరూపం దాల్చని మూసీ ప్రక్షాళన
ఫ భువనగిరిలో బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

కాంగ్రెస్‌ది ఓటు బ్యాంకు రాజకీయం