బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌

Aug 8 2025 7:13 AM | Updated on Aug 8 2025 7:13 AM

బ్లాక

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌

యాదగిరిగుట్ట రూరల్‌: హైదరాబాద్‌– వరంగల్‌ ప్రధాన జాతీయ రహదారి – 163 యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పరిధి నుంచి ఆలేరు ప్రాంతం వరకు విస్తరించి ఉంటుంది. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యేడాది కాలంలో 110 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 13 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

8 బ్లాక్‌స్పాట్‌ల గుర్తింపు

యాదగిరిగుట్ట మండల పరిధిలో 8 బ్లాక్‌ స్పాట్‌ (ప్రమాదాలు జరిగే ప్రాంతం)లను ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. వంగపల్లి గ్రామం లోపలికి వచ్చే రహదారి, వంగపల్లి బైపాస్‌, రామాజీపేట గ్రామం, తాళ్లగూడెం బస్‌స్టాప్‌, బాహుపేట స్టేజీ, చిన్నకందుకూరు స్టేజీ, పెద్దకందుకూరు గ్రామం, ఆలేరు ఎగ్జిట్‌ ప్రదేశం ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రదేశాల్లో బ్లాక్‌అండ్‌ ఎల్లో హాజార్డ్‌, డెలిరేషన్‌ బోర్డులు, మీడియన్‌ స్టార్టింగ్‌ బోర్డులు, స్పీడ్‌ లిమిట్‌ బోర్డులు, ప్లాస్టిక్‌ స్టాపర్‌లు, పవర్‌ బ్లింకర్‌లు, గో స్లో, ఆక్సిడెంట్‌ ఇండికేషన్‌లు, వంటి బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

అతివేగంతో వచ్చి ప్రమాదాల బారిన..

ఆలేరురూరల్‌: ఆలేరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో సాయిబాబ గుడి సమీపంలో, కందిగడ్డ తండా సమీపంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడగా.. 14 మంది త్రీవంగా గాయపడ్డారు. స్పీడ్‌ బ్రేకర్లు వేసిన చోట్ల రేడియంతో గుర్తులు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు అతివేగంతో వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు.

హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ

రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. వీటి నివారణకు హైవే, పోలీస్‌ శాఖ దృష్టి సారించింది. అధికంగా ప్రమాదాలు

జరుగుతున్న ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బోలోర్స్‌, రేడియం స్టిక్కర్లు, సూచికలు తదితర ఏర్పాట్లు, స్పీడ్‌ గన్లు ఏర్పాటు

చేయనున్నారు.

స్పీడ్‌గన్లు ఏర్పాటు చేస్తాం

వరంగల్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిలో ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కంటే ప్రమాదాల సంఖ్య తగ్గించాం. ప్రమాదాలు జరిగే చోట బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి, ఇండికేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. వాహనాలు 80 స్పీడ్‌ దాటితే జరిమానాలు పడేలా, స్పీడ్‌ గన్‌లను కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా రాచకొండ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించాం. ఇప్పటికే కొన్ని ఇండికేషన్‌ బోలోర్స్‌ కూడా పెట్టాం.

– యెలగొండ కృష్ణ, ట్రాఫిక్‌ సీఐ,

యాదగిరిగుట్ట సర్కిల్‌

ఫ హైదరాబాద్‌ – విజయవాడ

జాతీయ రహదారిపై నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు

ఫ నివారణపై దృష్టి సారించిన హైవే, పోలీస్‌ శాఖ

ఫ ఆయా ప్రాంతాల్లో రేడియం

స్టిక్కర్లు, సూచిక బోర్డుల

ఏర్పాటుకు సన్నాహాలు

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌ 1
1/3

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌ 2
2/3

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌ 3
3/3

బ్లాక్‌స్పాట్‌లపై నజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement