
100 రోజులు పని కల్పించాలి
రాజాపేట: ప్రతి కూలీకి 100 రోజు పనిదినాలు కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేష్ సూచించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాజాపేట మండలంలో నిర్వహించిన ఉపాధిహామీ పనులపై బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని స్పష్టం చేశారు. పనుల కొలతల్లో వ్యత్యాసం ఉండటంతో టెక్నికల్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఉపేందర్‌రెడ్డి, మేనేజర్ ఆదిత్యవర్థన్, ఎంపీడీఓ నాగవేణి, ఈసీ కర్ణాకర్ పాల్గొన్నారు.