
సంప్రదాయ డిజైన్లకు ఫ్యాషన్ జోడించాలి
చేనేత రంగంలోకి వచ్చే యువతను ప్రోత్సహించాలి. ముఖ్యంగా నిఫ్ట్ ద్వారా నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పించాలి. ఇక్కత్‌లో సంప్రదాయ డిజైన్లలో ఫ్యాషన్లను జోడించి వినూత్నంగా తయారు చేస్తే మార్కెటింగ్ అవకాశాలకు కొదవ ఉండదు. పోచంపల్లి ఇక్కత్ కు అంతర్జాతీయంగా పేరుంది. కానీ అందుకనుగుణంగా పబ్లిసిటీ లేదు. అందుకే ఎయిర్ హోస్టేస్ తప్పని సరిగా చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలి. దేశంలోని ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రధాన నగరాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్‌ను ప్రమోట్ చేయాలి. కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయంతో పాటు పట్టు చీరను ప్రభుత్వం ఇవ్వాలి. –సాయిని భరత్, కళాపునర్వి
హ్యాండ్లూమ్ యూనిట్, పోచంపల్లి