సృజనాత్మకతకు పెద్దపీట
ఫ కాలానుగుణంగా నూతన డిజైన్ల రూపకల్పన
ఫ దేశ, విదేశాల్లో చేనేతకు ఆదరణ
ఫ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు
నేడు జాతీయ చేనేత దినోత్సవం
ప్రింటెడ్ బెడద
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జియోగ్రాఫికల్ ఐడెంటిటీ(పేటెంట్ హక్కులు) ఉన్న పోచంపల్లి ఇక్కత్ , సిద్ధిపేట గొల భామ, గద్వాల చీరలకు ప్రింటెండ్ బెడదతప్పడంలేదు. చేనేత వస్త్రాలైన పట్టు చీరలు, రుమాలు, కార్పెట్, బెడ్‌షీట్స్, మ్యాట్‌లను పవర్‌లూమ్‌పై తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. గొల్లభామ కొచ్చి, ఆంధ్రప్రదేశ్, పోచంపల్లి చేనేతలకు బెంగళూరు, సూరత్, తమిళనాడు, గద్వాల చీరలను తమిళనాడు,కర్ణాటకలో పవర్ లూమ్‌లపై డూప్లికేట్ తయారు చేస్తున్నారు. దీని వల్ల చేనేత బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు 2003లో, గద్వాల చీరలకు 2009లో కేంద్ర ప్రభుత్వం జీయోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ(పేటెంట్) హక్కులను ఇచ్చింది. పోచంపల్లి చేనేత 11 డిజైన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈచేనేతలను ఎవరైనా డూప్లీకేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన ఈపూరి భాస్కర్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కరోనా లాక్‌డౌన్‌లో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఐదు మగ్గాలు నిర్వహిస్తూ నూతన డిజైన్లతో పోచంపల్లి చేనేత చీరలు నేస్తున్నాడు. తనతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలోని మైక్రోబయాలజీ విభాగంలో తిరిగి ఉద్యోగంలో చేరాడు. చేనేత వృత్తిని వీడలేక ఉద్యోం చేస్తూనే కొనసాగిస్తున్నానని, కొత్తదనానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని భాస్కర్ అంటున్నాడు.
చేనేతకు కొత్త బ్రాండ్
చేనేతకు కొత్త బ్రాండ్
చేనేతకు కొత్త బ్రాండ్
చేనేతకు కొత్త బ్రాండ్
చేనేతకు కొత్త బ్రాండ్
చేనేతకు కొత్త బ్రాండ్