
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రాజాపేట : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాజాపేట మండలంలోని దూదివెంకటాపురంలో పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.తాగునీరు, రవాణా సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధిహామీ పనులు, మహిళా సంఘాలకు రుణాలు, రేషన్‌కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, రెవెన్యూ, విద్యుత్ తదితర పథకాలు అమలుతీరుపై చర్చించారు. కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ త్వరిగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ కల్లా విద్యుత్ సబ్ స్టేషన్, హెల్త్ సబ్‌సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలీవరీలు చేయించుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎదురయ్యే ఇబ్బందులను గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం గ్రామంలోనే బస చేశారు. గురువారం ఉదయం గ్రామంలో తిరిగి సమస్యలు తెలుసుకుంటానని, వనోమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని, ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
ఫ దూదివెంకటాపురంలో పల్లెనిద్ర