
ఫ తరగతి గదుల్లోకి వర్షపు నీరు
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో
ఇసుక అక్రమ డంపింగ్
మోత్కూరు : మోత్కూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో కొంత మంది ట్రాక్టర్ల యజమానులు ఇసుకను అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. పాటిమట్ల గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల కోసం సదర్శాపురం బిక్కేరు నుంచి ఇసుకను తీసుకువచ్చేందుకు తహసీల్దార్ అనుమతులు పొంది వాటికి అదనంగా తరలిస్తూ రహస్య ప్రాంతాల్లో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇసుకను రాత్రి వేళల్లో లారీల ద్వారా తరలించేందుకు పాటిమట్ల కొత్త కాలనీ వద్ద ఇసుక డంపింగ్ చేశారని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాటిమట్ల, సదర్శాపూర్ గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు
చౌటుప్పల్ : మండల పరిఽధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో బుధవారం బస్సు ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండుమల్కాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఏపీకి చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో బుధవారం వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన పాశం వంశీ(40) అనారోగ్యానికి గురవడంతో చికిత్స నిమిత్తం సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందిన మరుసటి రోజు మంగళవారం చౌటుప్పల్‌లోని తన అత్తగారి ఇంటికి వెళ్లాడు. అదే రోజు తెల్లవారుజామున బాత్‌రూమ్ కోసమని వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో అతడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ టీం దాడులు
భువనగిరిటౌన్ : భువనగిరి టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనన్ టీం బుధవారం భువనగిరి పట్టణంలోని చేపట్టిన దాడుల్లో 70 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిని సమాచారం మేరకు భువనగిరి పట్టణంలోని బ్రహ్మణవాడ నివాసం ఉంటున్న కాసీం షేఖ్ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఖాసీం షేఖ్ గంజాయిని వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకువచ్చిన భువనగిరిలో విక్రయించే వాడని పోలీసులు గుర్తించారు. అతడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ రాధాకృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాస్, టీం బృందం నర్సిరెడ్డి, దుర్గయ్య, లింగస్వామి, నిహారిక, సురేష్ తనిఖీల్లో తదితరులు పాల్గొన్నారు.

ఫ తరగతి గదుల్లోకి వర్షపు నీరు

ఫ తరగతి గదుల్లోకి వర్షపు నీరు