
కృష్ణా తీరాన శైవ క్షేత్రం
000
పెద్దమునిగల్‌లోని కృష్ణా తీరంలో
ఏర్పాటు చేసిన మహాశివుడి విగ్రహం
ఫ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న
పెద్దమునిగల్‌లోని కృష్ణా తీరం
ఫ నాలుగేళ్లుగా గంగా హారతి
చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ కృష్ణా తీరంలో మహా శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామస్తులు విరాళాల రూపంలో రూ.50లక్షలు సేకరించి శివాలయాన్ని నిర్మించి, మహాశివుడి ప్రతిమ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ గంగా హారతి నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక వైపు కృష్ణా హారతి.. మరో వైపు మహా శివునికి ప్రత్యేక పూజలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కృష్ణా తీరంలోని వైజాగ్ కాలనీ అందాలు వీక్షించేందుకు వెళ్లే పర్యాటకులు పెద్దమునిగల్ కృష్ణా తీరాన గల మహాశివుని దేవాలయాన్ని సైతం దర్శించుకుంటుండడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.
గంగా హారతి ఇక్కడి ప్రత్యేకత
కార్తీక మాసంలో ప్రతి ఏడాది ఇక్కడ శివుడికి నిర్వహించే గంగా హారతి ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుంది. గ్రామస్తులందరం కలిసి సుమారు రూ.50లక్షలు విరాళాలు సేకరించి, మహాశివుడి దేవాలయాన్ని నిర్మించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది.
– కోతి యుగేంధర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్