
ప్రపంచ చెస్ చాంపియన్ ఆనంద్‌ను కలిసిన కరుణాకర్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సాధించిన విశ్వనాథ్ ఆనంద్‌ను జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్‌రెడ్డి బుధవారం చైన్నెలో కలిశారు. చైన్నెలో జరిగిన చెస్ ఎగ్జిబిషన్ నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో చెస్ క్రీడాకారుడి పేరు మీద స్టేడియం ఏర్పాటు చేయడం అభినందనీయమని, త్వరలోనే తాను స్టేడియం సందర్శిస్తానని ఆనంద్ చెప్పినట్లు కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
ఫ్లైఓవర్‌కు పగుళ్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తా నుంచి వైకుంఠద్వారం వరకు వేసిన ఫ్లైఓవర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్డు విస్తరణలో భాగంగా గత ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశంతో రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఫ్లైఓవర్‌ను నిర్మించింది. ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి గాంధీ నగర్‌కు వెళ్లే దారిలో స్లాబ్‌కు పగుళ్లు రావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి పెట్టి, ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రపంచ చెస్ చాంపియన్ ఆనంద్‌ను కలిసిన కరుణాకర్‌రెడ్డి