
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
సాక్షి,యాదాద్రి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్ రావుతో కలసి అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు నిర్వహిస్తున్నందున అందుకు అనుగుణంగా వేదిక, వీఐపీలు, అధికారులకు, ఇతరులకు అనుకూలంగా సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం పాల్గొన్నారు.
రసాయన, ఔషధ ఫ్యాక్టరీలు తనిఖీ చేయాలి
జిల్లాలోని అన్ని రసాయన, ఔషధ ఫ్యాక్టరీలను తనిఖీ చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా ఫైర్ ఆఫీసర్, ఇండస్ట్రీస్ ఆఫీసర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పాశ మైలారం ప్రాంతంలో జూన్‌లో జరిగిన భారీ విస్పోటన ఘటనకు గురైన తర్వాత భద్రతా సమస్యలపై చర్చించారు. జిల్లాలోని పరిశ్రమ పురోగతిని సమీక్షించేందుకు 19వ తేదీన రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఫ భువనగిరి కలెక్టర్ హనుమంతరావు