సాక్షి,యాదాద్రి: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెట్ అధికారులు చేపట్టిన విచారణ బుధవారం మూడో రోజు కొనసాగింది. కలెక్టరేట్‌లోని సివిల్ సప్‌లై కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. వలిగొండ మండలం సంగెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో లావాదేవీలకు సంబంధించిన రికార్డులను విచారణ అధికారులు పరిశీలించారు. ట్రక్‌షీట్లు, రైతులకు బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రిజస్టర్ జిరాక్స్ ప్రతులు తీసుకున్నారు. ట్రక్ షీట్లలో రైతుల పేర్ల మార్పు, చెల్లింపులు తదితర వాటిపై సివిల్ సప్‌లై కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని విచారించారు. అలాగే బీబీనగ్ మండలంలోని రుద్రవెళ్లి, చినరావులపల్లి, రాఘవాపురంతో పాటు మరికొన్ని గ్రామాల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా జరిగిన కొనుగోళ్ల వివరాలు సేకరించారు.
సీఎంఆర్‌పైనా..
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేశారు. సీజన్ వారీగా మిల్లర్లకు అప్పగించిన ధాన్యం, మిల్లర్లు ప్రభుత్వానికి ఇచ్చిన సీఎంఆర్ వివరాలు సేకరించారు.
ఫ సీఎంఆర్, ధాన్యం కొనుగోళ్లు,
చెల్లింపులపై రికార్డుల పరిశీలన